Header Banner

భూమి దిశగా దూసుకువస్తున్న పెద్ద సైజ్ ఆస్టరాయిడ్! నాసా ఏం చెబుతోందంటే!

  Sun Feb 02, 2025 10:20        World

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలాలు ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

 

అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ (ఐఏసీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకువస్తోందని, దీని పరిమాణం సుమారు ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని తెలిపారు. ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తోందని, భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 2032లో భూమిని ఢీకొట్టవచ్చని అంచనా వేశారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

130 – 300 అడుగుల పొడవు గల ఈ గ్రహశకలం మానవాళి మొత్తానికి తక్కువ ప్రమాదకారి అయినా ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం 8 మెగా టన్నుల టీఎన్‌టీకి సమానమని, ఇది హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కన్నా 500 రెట్లు శక్తివంతమైనది అయి ఉండవచ్చని వారు వెల్లడించారు. 

 

అయితే, 2032 డిసెంబర్ 22న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఒక్క శాతమేనని, అంటే 99 శాతం దాని ప్రభావం భూమిపై ఉండదని వారు తెలిపారు. కాగా, ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ కనిపెట్టింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #World #Asteroid #Space #Astronomy